![]() |
![]() |

డాన్స్ ఐకాన్ సీజన్ 2 లో మెంటార్ ప్రకృతి కంటెస్టెంట్ బర్కత్ అరోరా ప్లేస్ లో నెక్స్ట్ వీక్ వర్తికా ఝా అనే డాన్సర్ ఆడియన్స్ ని తన డాన్స్ తో అలరించబోతోంది. ఇంతకు ఈమె ఎవరు ఆమె బయోగ్రఫీ ఏంటో చూద్దాం. వర్తికా ఝా ఉత్తర్ ప్రదేశ్ లోని సొన్ భద్రలో 8 ఏప్రిల్ 2000 లో పుట్టింది. తండ్రి అరవింద్ కుమార్ ఝా..రేణుసాగర్ లో ఉన్న హిండాల్కో కంపెనీలో ఆపరేటర్ గా చేస్తున్నారు. ఇక తల్లి పేరు కాంటా ఝా. వర్తికా ఝా బెస్ట్ కొరియోగ్రాఫర్ మాత్రమే కాదు మంచి నటి కూడా. 2018లో స్టార్ ప్లస్ డ్యాన్స్ రియాలిటీ షో డాన్స్ ప్లస్ సీజన్ 4 లో 2వ రన్నరప్‌గా నిలిచింది. అప్పటి నుండి ఆమె బెస్ట్ డాన్సర్ గా, బెస్ట్ కొరియోగ్రాఫర్ గా పేరుతెచ్చుకుంది.
తర్వాత డ్యాన్స్ ప్లస్ జడ్జ్, కొరియోగ్రాఫర్ , బాలీవుడ్ డైరెక్టర్ రెమో డిసౌజా తన మూవీ స్ట్రీట్ డ్యాన్సర్ 3Dలో వరుణ్ ధావన్, శ్రద్ధాకపూర్ తో కలిసి వర్తిక నటించింది. ఆమె సోనీ టీవీ నిర్వహించిన "ఇండియాస్ బెస్ట్ డ్యాన్సర్ సీజన్ 1 "లో కొరియోగ్రాఫర్‌గా తన కంటెస్టెంట్ టైగర్ పాప్ అలియాస్ అజయ్ సింగ్ తో కలిసి పార్టిసిపేట్ చేసింది. ఆ సీజన్ లో టైగర్ పాప్ సీజన్ 1 విజేతగా నిలిచి రూ. 5 లక్షల నగదు బహుమతిని గెలుచుకున్నాడు. 2021లో సోనీ టీవీ నిర్వహించిన "సూపర్ డ్యాన్సర్ చాప్టర్ 4 "షోలో తన కంటెస్టెంట్ సంచిత్ చనానాకు వర్తిక కొరియోగ్రాఫ్ చేసింది. దాంతో ఆమె 2వ రన్నరప్‌గా నిలిచింది. 2022లో సోనీ టీవీ నిర్వహించిన "ఇండియాస్ బెస్ట్ డ్యాన్సర్ సీజన్ 2 లో తన కంటెస్టెంట్ సౌమ్య కాంబ్లేకి కొరియోగ్రాఫ్ చేసి విజేతగా నిలిచింది వర్తిక.. 2022లో జీ టీవీ నిర్వహించిన డాన్స్ ఇండియా డాన్స్ లిటిల్ మాస్టర్స్ సీజన్ 5 లో వర్తికా కంటెస్టెంట్స్ అందరికీ టీమ్ కెప్టెన్‌గా చేసింది. ఆ తర్వాత 2022లో జీ టీవీ నిర్వహించిన డాన్స్ ఇండియా డాన్స్ సూపర్ మామ్స్ సీజన్ 3 లో తన కంటెస్టెంట్ వర్ష బుమ్రాకి కొరియోగ్రాఫ్ చేసి విన్నర్ గా నిలిచింది. ఆ తర్వాత 2023లో వర్తిక "ఇండియాస్ బెస్ట్ డాన్సర్" సీజన్ 3 లో తన కంటెస్టెంట్ అక్షయ్ పాల్ కి కొరియోగ్రాఫ్ చేసింది. ఇక 2024లో ఆమె "ఇండియాస్ బెస్ట్ డాన్సర్" సీజన్ 4లో తన కంటెస్టెంట్ నెపో అలియాస్ దీపక్ షాహికి కొరియోగ్రాఫర్ చేసింది. ఇక ఇప్పుడు డాన్స్ ఐకాన్ కి కంటెస్టెంట్ గా వచ్చింది.
![]() |
![]() |